Top Stories

ప్లీజ్ పవన్ సినిమా హిట్ చేయండి : నాదెండ్ల ఆడియో లీక్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలు, జన సైనికులతో మాట్లాడిన ఆయన, సినిమాకు మద్దతుగా నిలవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే మూడుసార్లు నాదెండ్ల మనోహర్ జనసేన నేతలతో ఈ విషయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

నాదెండ్ల మనోహర్ చేసిన ముఖ్య విజ్ఞప్తులు

జనసైనికులు డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని సినిమా చూడాలని, ఇతరులకు కూడా సినిమా చూసేలా చేయాలని మనోహర్ కోరారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు. ‘హరిహర వీరమల్లు’కు నెగటివ్ టాక్ వస్తోందని, దాన్ని మార్చడానికి వారం రోజుల పాటు సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలని, మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చేయాలని తెలిపారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలని ఆదేశించారు. ప్రతి థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాలని, అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత జనసైనికులదేనని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. డబ్బులు లేనివారికి డబ్బులు ఇచ్చి సినిమా చూపించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ సినిమాను విజయవంతం చేయడానికి జనసేన శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం.

https://x.com/TeluguScribe/status/1949037868443181367

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories