ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లిక్కర్ స్కాం నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన అధికార యంత్రాంగం, ఇప్పుడు ఆయన తండ్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా పేరొందిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిను కూడా లక్ష్యంగా చేసుకుంటూ వ్యవహరిస్తోంది.
తాజాగా పెద్దిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనను స్టేషన్‌లోకి తీసుకెళ్లిన తర్వాత, కనీసం కుర్చీ కూడా వేయకుండా నిలబెట్టి నిలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు, “మీకు కుర్చీ వేయొద్దని అధికారులు ఆదేశించారు సార్” అని చెప్పినట్లుగా సమాచారం.
ఈ ప్రవర్తనపై పెద్దిరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకి దిగజారిందని ఆరోపిస్తున్నారు. ఇదంతా పగతో కూడిన రాజకీయమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రతిద్వంద్వంతోనే ఈ చర్యలకు తెగబడుతున్నారని విమర్శిస్తున్నారు.
ఇటీవల మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసు, ఇప్పుడు పెద్దిరెడ్డిని వేధిస్తున్న తీరు చూస్తుంటే ఇది ఒకే దిశలో ముందుకెళ్తున్న రాజకీయ కక్షగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయాలపాలైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ నిజంగా చంద్రబాబు పెద్దిరెడ్డిపై పగతోనే వ్యవహరిస్తున్నారా? లేక ఇది అధికార యంత్రాంగపు నిర్ణయమా? అనేది సమయం చెప్పాల్సిన విషయం. కానీ ప్రజలలో మాత్రం “ఇంత పగ ఏంటి బాబు?” అనే ప్రశ్న మారుమోగిపోతోంది.