ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్. జనసేన అధినేతగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి పదేళ్లు దాటిన పవన్, ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్నారు. 2014లో టీడీపీకి మద్దతు, 2019లో స్వతంత్రంగా పోటీ, 2024లో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర ఇవి అన్ని ఆయన రాజకీయ దృక్పథాన్ని సూచిస్తున్నాయి.
తన అభిమానుల ఆశలు సీఎం పదవిపై ఉండగా, పవన్ మాత్రం కూటమిని ముందుకు నడిపే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పూర్తి నమ్మకంతో కూటమి విజయానికి పని చేశారు. దీంతో కాపు సామాజిక వర్గం మద్దతుతో పాటు ప్రజలలో విశ్వాసం పెరుగుతోంది.
అయితే పవన్ వ్యూహం ఏంటన్నదే ప్రశ్న. తాను ఎప్పటికైనా సీఎం అవుతారని అభిమానులు ఆశిస్తుండగా, ఆయన మాత్రం ఓ దశలవారీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయ ప్రయాణం ఏ దిశగా పోతుందో చూడాలి.