ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ప్రత్యేక భద్రత కల్పించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భద్రత సరిగా లభించకపోవడంతో, ఇప్పుడు జగన్‌కు ప్రైవేట్ భద్రతా బృందం ఏర్పాటు చేశారు. సమాచారం మేరకు ఈ బృందంలో ఆర్మీ రిటైర్డ్ సిబ్బంది ఉన్న 40 మంది ఎంపికయ్యారు.
ఈ నెల 6న కర్నూలు జిల్లా డోన్‌లో జరగనున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ కార్యక్రమంలో నుంచి ఈ బృందం విధుల్లోకి దిగనుంది. రోప్ ప్రొటెక్షన్‌తోపాటు జిల్లాల పర్యటనల్లో పూర్తి భద్రతను ఈ బృందం అందించనుంది. ఇటీవల జగన్ కాన్వాయ్‌కి ఎదురైన ఘటనల నేపథ్యంలో పార్టీలో భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే ఈ ప్రైవేట్ భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.