రాజకీయాలు – సినిమాలు అన్నీ కలగలిసి పోయే రంగం మన తెలుగు రాష్ట్రాలు. తాజాగా ఈ మిశ్రమానికి మరొక ఉదాహరణగా రజనీకాంత్ కూలీ సినిమా, ఎన్టీఆర్ వార్-2 సినిమాలు నిలిచాయి.
మంత్రి నారా లోకేష్ కూలీకి మద్దతు తెలపడం, అదే సమయంలో వైసీపీ శ్రేణులు వార్-2కు బలమైన అండగా నిలవడం రాజకీయ చర్చలకు ఎంధనం పోశాయి. టీడీపీ మద్దతు రజనీకాంత్ వైపు ఉండగా, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమా కోసం విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇకపై బాక్సాఫీస్‌లో సినిమాల పోరు మాత్రమే కాదు, రాజకీయ పార్టీల మధ్య కూలీ vs వార్-2 పోటీ కూడా ఆసక్తికరంగా మారనుంది.