Top Stories

బాబు గారిని అడ్డంగా బుక్ చేసిన మహిళ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతోంది. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని పీఆర్ స్టంట్స్‌ కోసం వాడుకోవడం టీడీపీకి ఇప్పుడు ఆటగా మారింది.

బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం బాబు స్వయంగా ఒక మహిళను ప్రశ్నించారు. “ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు ఏం ఉపయోగం?” అని అడగగా, ఆ మహిళ ఇచ్చిన సమాధానం మాత్రం ట్రోల్స్‌కు బలమైన ఆయుధమైంది.

ఆవిడ ఏం చెప్పిందంటే.. “బస్సు టికెట్ డబ్బులు మిగులుతాయి.. ఆ డబ్బుతో మేము చీటీలకూ కట్టుకుంటున్నాం” అని. ఈ సమాధానం విన్నవెంటనే అక్కడ ఉన్నవారే కాదు, వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.

సాధారణంగా బస్సు టికెట్ చార్జీలు కొన్ని రూపాయలే ఉంటాయి. ఆ డబ్బు మిగిలితే దాన్ని చిట్టీలు కట్టుకోవడం అసాధ్యం అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో బాబు అడిగిన ప్రశ్న, ఆవిడ ఇచ్చిన సమాధానం రెండూ కలసి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో “టికెట్ డబ్బులతో చీటీలకూ కడతామంటారా?”, “ప్రచారం కోసం ఇలా ఓవర్ యాక్షన్‌లు చేస్తారా?” అంటూ మీమ్స్, ట్రోల్స్ ముదురుతున్నాయి. బాబు గారూ తగ్గించుకుంటే మంచిదని, ఇలా ప్రజల ముందర అసంబద్ధ సమాధానాలు తెచ్చిపెట్టుకోవడం పార్టీకి కూడా ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి మేలు చేయాలనుకున్న పథకం పీఆర్ స్టంట్స్ వల్లే సోషల్ మీడియాలో వ్యంగ్యానికి గురవుతోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories