Top Stories

ఇప్పుడు చెప్పు పవన్?

big368
 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సీజన్‌లో కొన్ని కేసులు, కొన్ని సమస్యలు బిగ్ ఇష్యూలుగా మారుతాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసు అలాంటి ఒక అంశంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసుపై బట్టలు చింపుకొని, మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మేము అధికారంలోకి వస్తే ఇదే మా మొదటి కేసు… దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వ్ చేస్తాం” అని గట్టిగా చెప్పిన విషయం అందరికీ గుర్తుంది.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనసేన – టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ సుగాలి ప్రీతి కేసు మాత్రం ఇప్పటికీ దుమ్ము పట్టేలా ఉంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత సుగాలి ప్రీతి తల్లి స్వయంగా పవన్‌ను కలిసినా, “మేము దీని మీద పని చేస్తున్నాం” అన్న జవాబు తప్ప కొత్తగా ఏ చర్యా కనిపించలేదు.

ఇప్పటికి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఈ కేసులో ఎలాంటి స్పష్టమైన దర్యాప్తు ముందుకు సాగలేదు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న సుగాలి ప్రీతి కుటుంబం ఇంకా నిరాశతోనే ఉంది.

ఇక నెటిజన్లు మాత్రం పవన్ పాత వీడియోలు, హామీలను బయటకు తీస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు విసురుతున్నారు. “అప్పుడు హాట్ టాపిక్‌గా వాడుకొని మైలేజ్ సంపాదించారు, ఇప్పుడు అధికారంలో ఉన్నా న్యాయం మాత్రం కనిపించడం లేదు” అని విమర్శలు గుప్పిస్తున్నారు.

సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా ఒకప్పుడు ఆయుధమైంది. కానీ ఇప్పుడు అదే ఆయుధం ఆయనను ఇబ్బందుల్లో పడేస్తోంది. న్యాయం జరగకపోతే ప్రజల విశ్వాసం క్రమంగా దెబ్బతింటుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

https://x.com/Shivreddy_ysrcp/status/1957090419659165795

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories