Top Stories

టీవీ5 సాంబాను ఆటాడుకున్నాడు

 

టెలివిజన్ మీడియా వేదికగా ఒకవైపు, సోషల్ మీడియా వేదికగా మరోవైపు ఘర్షణాత్మక వ్యాఖ్యలతో టీవీ5 సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు – యూకే వైసీపీ ఫాలోవర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చెలరేగింది.

చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలతో తరచూ టీవీ5, ముఖ్యంగా సాంబశివరావుపై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి యూకే వైసీపీ ఫోరంలో కీలకంగా వ్యవహరిస్తూ, టీవీ5 సాంబాపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సాంబశివరావు, తన టీవీ5 వేదికగానే ఏకంగా సవాల్ విసిరారు. “నిజంగా దమ్ముంటే ఏపీకి రండి. జూబ్లీహిల్స్ చౌరస్తాలో ఎదురెదురుగా కూర్చొని చర్చిద్దాం” అంటూ సవాలు విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక దీనిపై ప్రదీప్ రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. “నువ్వు జర్నలిస్టువా? లేక వీధి రౌడీవా? చౌరస్తాలో కొట్టుకుందామా అని సవాల్ విసరడం నీ స్థాయేంటో చూపిస్తుంది. బాలయ్య డైలాగులు చెప్పడం నీ పని కాదు. జర్నలిస్టుగా వేషం వేసుకున్నా అసలు ధోరణి మాత్రం రౌడీయిజం. చంద్రబాబు మోచేతినీళ్లు తాగుతావు తప్ప నిన్ను ఎవడూ పట్టించుకోడు” అంటూ ఎద్దేవా చేశారు.

ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఒకవైపు సాంబశివరావు వైఖరిని తప్పుబడుతుంటే, మరోవైపు ఆయనకు మద్దతు పలుకుతున్నవారు కూడా ఉన్నారు. మొత్తానికి సాంబా–ప్రదీప్ రెడ్డి వాగ్వాదం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదానికి నాంది పలికింది.

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories