తెలుగు రాజకీయాల్లో పీఆర్ స్టంట్స్‌కు పాతికేళ్ల అనుభవం ఉన్నవారిలో నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలుస్తారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి ప్రయత్నంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు.
పారిశుధ్య కార్మికుడిలా వేషం వేసుకొని చెత్త ఏరుతూ, పురపాలక వాహనంలో తోలుకెళ్తూ కెమెరాల ముందు ప్రత్యక్షమైన చంద్రబాబు తనదైన స్టైల్‌లో పీఆర్ షో ఆడారు. అసలు పారిశుధ్య కార్మికులు అలా కష్టపడుతుంటే, ఆయన మాత్రం కొద్ది నిమిషాలు వేషధారణతో చేసిన ఈ ప్రదర్శన హడావుడిగా మారింది.
ఇక నెటిజన్లు మాత్రం దీన్ని సరదాగా తీసుకొని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.“చంద్రబాబు ‘నట భీభత్స’”, “నారా నటరాజు” అంటూ కొత్త కొత్త బిరుదులు ఇస్తూ ట్రోళ్లు చేస్తున్నారు.
రాజకీయాల్లో ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు. కానీ ప్రతి చర్యను కెమెరాలు, మైకులు, ఫోటోషూట్లతో హడావుడి చేయడం వల్ల అది సహజసిద్ధమైన సేవలా కనిపించకుండా పీఆర్ స్టంట్‌లా మారిపోతుందని విమర్శకులు చెబుతున్నారు.
మొత్తానికి చంద్రబాబు తాజా ‘పారిశుధ్య ప్రదర్శన’ రాజకీయ వర్గాలకే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన నిజంగానే శ్రద్ధతో చేశారా? లేక పీఆర్ కోసం చేశారా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.