సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే పవన్ కళ్యాణ్ ప్రవర్తనపై భక్తుల మధ్య చర్చ మొదలైంది.
వినాయక చవితి అనే పండుగ సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా, ప్రతి హిందువు ఇళ్లలో జరుపుకునే పండుగగా నిలుస్తోంది. కానీ సనాతని అని బిల్డప్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పండుగ సందర్భంలో ఒక్క శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు. గణనాథుడి ఫొటో, భక్తి సందేశం, లేదా చిన్న అభినందన కూడా ఆయన సోషల్ మీడియాలో కనిపించలేదు.
ఇకపోతే, వినాయక చవితి శుభదినానే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ETVకి, అలాగే 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తిచేసుకున్న బాలకృష్ణకు మాత్రం హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో భక్తుల మనసులో ఒకే ప్రశ్న – “సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కు వినాయక చవితి ఎందుకు పట్టదా?”
భక్తి మాటలు, హిందూ భావజాలం రక్షణ అన్నప్పుడు బిల్డప్ తప్ప, చేతల్లో మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిలవాలంటే, మాటల కంటే కర్మలు ముందుండాలి. పండుగలతో అనుబంధం, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజలతో ఆధ్యాత్మిక సంబంధం బలపడేలా ఉండాలి.
కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈ విరుద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా అభిమానుల్లోనూ, హిందూ భక్తుల్లోనూ ఆయనపై గట్టి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, సనాతన ధర్మం రక్షకుడిగా కాకుండా కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే “సనాతని” ట్యాగ్ వాడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.