Top Stories

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని బాధితురాలు ప్రీతి తల్లి పార్వతి దేవి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

“న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతా” అని హెచ్చరించిన ఆమె, గిరిజనుల ఓట్లపై పవన్ కళ్యాణ్ చూపిన శ్రద్ధ.. వారి సమస్యలపై ఎందుకు కనబడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తమపై జరిగిన అన్యాయంపై ఉద్యమం చేస్తామని కూడా ప్రకటించారు.

2017లో కర్నూలులోని రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాఠశాల యజమాని కుమారులపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినా, నిందితులు కేవలం 23 రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది.

పవన్ కళ్యాణ్ సాక్షాత్కారంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసుపై చేస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి ఆందోళనకు దిగుతున్న పరిణామం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories