ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. తన చున్నీ వేసి సీటు రిజర్వ్ చేసుకున్నానని ఓ మహిళ చెప్పగా, ఆ సీటులో కూర్చున్న పురుషుడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
“ఇది నా సీటు.. నేను చున్నీ వేసుకున్నాను.. నీకు సిగ్గులేదా?” అంటూ ఆమె అరిచి, మాటలతో ఆగక చెప్పుతో కూడా కొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
సీటు సమస్యలపై తరచూ ఇలాంటి గొడవలు జరగడం వల్ల ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. వస్తువులు పెట్టి సీటు నిలుపుకోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా RTC అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.