బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది. ఇప్పటికే జబర్దస్త్ ఇమ్మానుయేల్, భరణి శంకర్, ఆశా షైనీ, రీతూ వర్మ, సంపత్ వంటి సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నట్టు లీక్ అయ్యింది. ఈ లిస్ట్‌లో కొత్తగా చేరింది మరో హాట్ న్యూస్ — ‘దండుపాళ్యం’ ఫేమ్ హీరోయిన్ సంజనా గల్రానీ.
సంజనా మొదటగా ప్రభాస్–పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బుజ్జిగాడులో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తెలుగులో పెద్దగా స్థిరపడలేకపోయినా, కన్నడలో మాత్రం టాప్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అంతేకాదు, అక్కడ బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా రాణించింది.
అయితే ఆమె జీవితంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. 2020లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మూడు నెలల జైలు శిక్ష కూడా అనుభవించింది. తర్వాత బెయిల్ మీద విడుదలై, అదే ఏడాది బెంగళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ పాషాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు ఈమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘బిగ్ బాస్ 9’ ద్వారా రాబోతోంది. గతంలో కన్నడ బిగ్ బాస్‌లో చూపించిన టఫ్ గేమ్ మాదిరిగానే ఇక్కడ కూడా అదరగొడుతుందా? లేక వివాదాలకే లిమిట్ అవుతుందా? అన్నది చూడాల్సిందే.