Top Stories

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ షోకి ఒక్కో జడ్జి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

 

ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ 9 పై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. గత సీజన్ ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ కూడా ఈ సీజన్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ‘అగ్నిపరీక్ష’ షో. సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ లో భాగంగా ఈ షో ని నిర్వహించారు. గత 8 రోజుల నుండి జియో హాట్ స్టార్ లో ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఈ షోలో నిర్వహిస్తున్న ప్రతీ టాస్క్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది. కంటెస్టెంట్స్ ని ఓటింగ్ లైన్ లో కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఈ షో కి జడ్జిలుగా నవదీప్,బిందు మాధవి మరియు అభిజిత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో వీళ్ళ నిర్ణయాలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కాస్త వ్యతిరేకత వచ్చింది.

కానీ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ జడ్జిలు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చారు. ఉదాహరణకు షాకిబ్ కి ఆడిషన్స్ లో అభిజిత్, బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. కానీ నవదీప్ మాత్రం అతనికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. అసలు బిగ్ బాస్ కి పనికిరాని వ్యక్తికి గ్రీన్ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చారు అని బిందు మాధవి నవదీప్ ని ప్రశ్నిస్తుంది కూడా. కానీ నవదీప్ ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఇచ్చాడు. కానీ ఇప్పుడు షాకిబ్ ని జనాలు బాగా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా పోలింగ్స్ లో అతనికి భారీ ఓటింగ్ పడుతుంది. దీనిని బట్టీ నవదీప్ తీసుకున్న నిర్ణయం కరక్ట్ కదా అనే అభిప్రాయానికి వచ్చారు నెటిజెన్స్. అయితే ఈ ముగ్గురు జడ్జిలు తమ సమయాన్ని వృధా చేసుకొని ఊరికే అక్కడికి వచ్చి కూర్చోరు కదా.

వాళ్లకు రెమ్యూనరేషన్ భారీ ఇస్తామని చెప్తేనే అక్కడికి వస్తారు. నవదీప్ కి ఒక్క రోజు షూటింగ్ కి గాను రెండున్నర లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట. అదే విధంగా అభిజిత్ మరియు బిందు మాధవి కి ఒక్క రోజు షూటింగ్ కి గానూ రెండు లక్షల రూపాయిలు ఇచ్చారట. 9 రోజుల పాటు ఈ అగ్ని పరీక్ష షూటింగ్ జరిగింది. అంటే నవదీప్ కి 22.5 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ రాగా, అభిజిత్ మరియు బిందు మాధవి లకు చెరో 18 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇచ్చారట. ఇక యాంకర్ శ్రీముఖి కి ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఈమె ఒక్క రోజు షూటింగ్ కి గాను 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. అంటే 36 లక్షల రూపాయిలు అన్నమాట. కేవలం ఈ నలుగురికే దాదాపుగా కోటి రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసింది బిగ్ బాస్ యాజమాన్యం.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories