PawanKalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం ప్రమోషన్లు వేగం పెంచుకున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌లో హైప్‌ని మరింత పెంచేశాయి.
ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ విలన్ ఇమ్రాన్ హష్మీ డైలాగ్స్. “డియర్ ఓజీ.. నిన్ను కలవాలని, మాట్లాడాలని, చంపాలని ఎదురు చూస్తున్నా.. హ్యాపీ బర్త్‌డే ఓజీ” అంటూ చెప్పిన మాటలు థియేట్రికల్ ఎఫెక్ట్‌ని రెట్టింపు చేశాయి. చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టిన షాట్‌కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రత్యేకంగా ఇంగ్లీష్ ర్యాప్‌తో కలిపిన మ్యూజిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లింప్స్‌లో చూపించని పవర్‌ఫుల్ షాట్స్‌ని ట్రైలర్ కోసం దాచిపెట్టారని సమాచారం. ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.