ఒకప్పుడు డిబేట్ అంటే మైక్ ముందు కత్తి తీసుకున్నట్టు ఊగిపోతూ, ప్రత్యర్థులపై అగ్గి ఉక్కులు కక్కే ఏబీఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు ప్రశాంత చిత్తంతో కూర్చొని “అవును బాబూ.. చెప్పండి బాబూ..” అన్నట్టు వినిపిస్తున్నాడు. ఆగ్రహం, ఆవేశం అన్నీ ఎక్కడికో జారిపోయి, ఇప్పుడు కాస్త నిరాశ, కాస్త నిస్పృహ మాత్రమే మిగిలినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక పాత వెంకటకృష్ణ డిబేట్ స్టైల్ గుర్తొస్తే, “ఇంకా మైక్ పగలదా?” అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే – ప్రతిపక్షం ఏం అన్నా, టీడీపీపై ఈగ వాలనీయని సైలెంట్ బాడీగార్డ్ లా వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా కవిత బీఆర్ఎస్ రాజకీయాలపై పడినప్పుడు కూడా, మునుపటి లాగా గర్జించకుండా చాలా నీట్‌గా, క్లాస్‌గా తన ఫస్ట్రేషన్ బయటపెట్టాడు. అలా గర్జించకపోయినా, ఆ వీడియో మాత్రం వైరల్ అవుతూ ఉంది.
ఫలితంగా నెటిజన్లు కసరత్తు మొదలుపెట్టారు. “ఫైర్ ఎక్కడ? ఫ్యూయల్ అయిపోయిందా?”.. “వీరి యాంకరింగ్ కి ఎనర్జీ డ్రింక్ అవసరం ఉన్నట్టుంది!” … వెంకటకృష్ణలో ఆవేశం మాయమైపోయింది.. ఇప్పుడు ఓపిక మాత్రమే మిగిలింది” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఏదేమైనా, వెంకటకృష్ణలో ఈ మార్పు వెనుక కారణం ఏమిటో ఆయనకే తెలుసు. కానీ పాత ఆగ్రహం మళ్లీ వస్తుందా? లేక ప్రశాంత యాంకరింగ్‌కే పర్మినెంట్ సెటిల్ అవుతారా? అన్నది చూడాలి.https://www.youtube.com/watch?v=bmRsWDMG_Tc