అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు, పెద్దకర్మలకు మెగా, అల్లు కుటుంబం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
పెద్దకర్మ అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్‌తో తన తల్లి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “కళ్యాణ్ బాబు సినిమా నటుడు కాకముందు, మా అమ్మ ఆయనను ‘కళ్యాణి’ అని పిలుస్తూ, నువ్వు సినిమాల్లో బాగా చేస్తావు అని ఎప్పుడూ ప్రోత్సహించేది. అసలు కళ్యాణ్‌ని ప్రోత్సహించిన తొలి వ్యక్తి మా అమ్మ” అని అన్నారు.
అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ, “ఆమె చివరి రోజుల్లో కూడా చిరంజీవి గారిని గుర్తుపట్టి స్పందించింది. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నిజంగా ఎంతో ప్రత్యేకమైనది” అని చెప్పారు.
ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. https://x.com/Telugu360/status/1965095231994687766?t=2RWZiR8RE8TdoE2gAfy1Ig&s=08