ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కమిషనర్ నీలం సాహ్ని పదవీ విరమణకు ముందే ఈ ప్రక్రియ ముగించాలని ఉద్దేశం.
అయితే అధికార వైసీపీ వైఖరి మాత్రం సందేహాస్పదంగా మారింది. ఇప్పటికే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఫలితాలు ఆ పార్టీకి గట్టి దెబ్బతీశాయి. శ్రేణుల్లో నైరాశ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ వెనకడుగు వేస్తుందనే ప్రచారం మొదలైంది.
కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరపాలన్న డిమాండ్ పెట్టడం కూడా బహిష్కరణకు మార్గం వేసే ప్రయత్నంగానే విశ్లేషకులు చూస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే వైసీపీ తన నిర్ణయం స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంది.
మొత్తానికి, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వ్యూహం ఏ దిశలో కదులుతుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.