తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ పురోగతి ఫోటోలను షేర్ చేస్తూ, తమ హయాంలోనే భారీ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని ప్రచారం చేశారు. అయితే రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం, అసలు అమర్ రాజా సంస్థ తెలంగాణకు రావడానికి కారణం ఏపీ మాజీ సీఎం జగన్ తో వైరం అని టీడీపీ ఆరోపిస్తోంది.
చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అమర్ రాజా కంపెనీ మోసాలు, స్థానికులకు ఉపాధి అందకుండా కుట్ర చేస్తున్న వైనంపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో సంస్థ యాజమాన్యం తెలంగాణ వైపు మొగ్గుచూపింది. కెసిఆర్ ప్రభుత్వం ఆహ్వానం పలకడంతో మహబూబ్ నగర్ వద్ద భారీ గిగా ఫ్యాక్టరీ స్థాపనకు మార్గం సుగమమైంది.
దీంతో వేలాదిమందికి ఉపాధి లభించనుండగా, కేటీఆర్ మాత్రం ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.