ఏపీ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగానే మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పెర్ని నాని, అవినాష్, వెల్లంపల్లి, విష్ణులపై ఇక వదిలిపెట్టేది లేదని.. విజయవాడలో ఉత్సవాలు పూర్తయిన తర్వాత వాళ్ల పని తేల్చుతానని పవన్ వార్నింగ్ ఇచ్చాడట.
అయితే దీనికి వైసీపీ సీనియర్ నేత పెర్ని నాని తక్షణమే మాస్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. “నువ్వేంటి పీకేది మా బొచ్చు” అంటూ పవన్‌ను నేరుగా సవాల్ చేశారు. పవన్ మాటల్లో అసలు దమ్ము లేదని, నువ్వు ఏం చేయలేవని స్పష్టంగా చెల్లాచెదురుగా పేల్చేశారు.
ఇక పవన్ కూడా అంత పవిత్రుడు కాదని.. అతడి చేసిన పాపాలు కూడా ఒకరోజు పండుతాయని నాని ఘాటుగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ జీవితాన్ని అతని అన్నయ్య చిరంజీవిలాగా గడపాలని సూచించారు.
ఈ పవన్ vs పేర్ని నాని వార్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ హెచ్చరికలు.. నాని కౌంటర్‌తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.