పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల పెంపు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. బెనిఫిట్ షో టికెట్ ధరను ప్రభుత్వం ఏకంగా రూ.1,000గా నిర్ణయించగా, సింగిల్ స్క్రీన్‌లలో రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసేందుకు అనుమతిచ్చింది.
ఈ నిర్ణయంపై వైఎస్సార్సీపీ వర్గాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పవన్ తన రాజకీయ హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు, పవన్ అభిమానులు ‘పుష్ప 2’కి కూడా అధిక ధరలు వసూలు చేశారని గుర్తుచేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.
దీంతో, ‘ఓజీ’ టికెట్ ధరల పెంపు సినిమా విషయాన్ని మించి రాజకీయ వాదోపవాదాలకు దారితీసింది. సినిమా విడుదలకు ముందు ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాల్సి ఉంది.