Top Stories

 పవన్ కు ఆర్ఆర్ఆర్ సలహా.. అసెంబ్లీలో అరుదైన సీన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒక సంభాషణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధం గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రఘురామ కృష్ణ రాజు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి పవన్ కళ్యాణ్ ఒక యాడ్ లో నటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. “సాధారణంగా మీలాంటి హీరోలు యాడ్స్ చేయాలంటే కోట్లు ఇవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వంలో నాయకుడిగా మీరు ఉచితంగా చేయాలి,” అంటూ చమత్కరించారు.

రఘురామ తన సంభాషణను కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ తన కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ కి ఒక్కమాట చెబితే చాలు, ఆంధ్రప్రదేశ్ లో చెత్త మొత్తం క్లీన్ అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేశారు. రఘురామ మాట్లాడుతున్న తీరు, ఆయన వేసిన జోకులకు పవన్ నవ్వుతూ కనిపించారు.

ఈ అరుదైన, సరదా సన్నివేశం అసెంబ్లీలో నవ్వులు పూయించడమే కాకుండా అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా చాటిచెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

https://x.com/M9News_/status/1968960303363670181

Trending today

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

Topics

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

Related Articles

Popular Categories