టీవీ5లో పనిచేసే మూర్తి తన ముక్కుసూటితనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ విషయాన్నైనా ఓపెన్‌గా చెప్పే ఆయన, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గడు. ఇదే కారణంగా ఒక వర్గం ఆయనను అభిమానిస్తుంటే, మరికొందరు విమర్శిస్తారు.
వేణు స్వామి వివాదంలో రోజుల తరబడి డిబేట్లు పెట్టి చరిత్రను వెలికితీయడం, ఒత్తిళ్లను లెక్క చేయకపోవడం మూర్తి ధైర్యానికి నిదర్శనం. ఆ ఎపిసోడ్ తర్వాత వేణు స్వామి జ్యోతిష్యం చెప్పడం మానేయాల్సి వచ్చింది.
ఇప్పుడు తాజాగా నటుడు ధర్మ మహేష్ – గౌతమి వివాదంపై మూర్తి ఫోకస్ పెట్టాడు. భర్త వేధింపులు, ఆర్థిక దోపిడీ, ఇతర సంబంధాల విషయాలు బయటపెట్టిన గౌతమికి మూర్తి బలంగా అండగా నిలుస్తున్నాడు. ధర్మ మహేష్ తన ప్రభావాన్ని ఉపయోగించి గౌతమిపై నెగటివ్ ప్రచారం చేయించగా, మూర్తి తన వేదికపై నిజాలను వెలుగులోకి తెస్తున్నాడు.
ఈ క్రమంలో మూర్తికి బెదిరింపులు వచ్చినా, ఆయన వెనక్కి తగ్గకుండా తన అడ్రస్, వాహన వివరాలన్నీ బహిరంగంగా చెప్పి సవాల్ విసిరాడు. ఇప్పుడు ధర్మ మహేష్ ఎలా స్పందిస్తాడన్నది హాట్ టాపిక్‌గా మారింది.
మూర్తి డిబేట్లకు మళ్లీ అదే ఉగ్రరూపం ప్రత్యక్షమవుతుందనే చెప్పొచ్చు.