ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. దీంతో ‘అఖిల భారత చిరంజీవి యువత’ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని నిర్ణయించింది.
అయితే విషయం చిరంజీవి వరకు చేరడంతో, ఆయన స్వయంగా అభిమానులను ఆపుతూ “కేసులు పెట్టడం మన సంస్కృతి కాదు” అని నచ్చజెప్పారు. ఫలితంగా మెగా ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం మెగా – నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అభిమాన సంఘం హెచ్చరిస్తూ, “భవిష్యత్‌లో ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోం” అని స్పష్టం చేసింది.
మొత్తం మీద మెగాస్టార్ జోక్యంతో పెద్ద వివాదం ఆగిపోయింది.