రాజకీయాల కంటే మీడియా బాధ్యత ఎక్కువగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను మరిచి వ్యక్తిగత దురభిప్రాయాలతో వార్తలు రాయడం ఇప్పుడు సామాన్య విషయమైపోయింది. ఈ పరిస్థితికి నిదర్శనం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు.
ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రారంభించినప్పుడు “ఏపీ శ్రీలంక అవుతుంది”, “రాజ్యం దివాళా తీస్తుంది” అని అబద్ధపు శీర్షికలతో పత్రికలో పెద్ద పెద్ద కథనాలు రాశారు. ప్రజల సంక్షేమానికి చేసిన ప్రయత్నాన్ని కూడా రాజకీయ కోణంలో తిప్పి చూపించారు.
ఇప్పుడు అదే రాధాకృష్ణ గారు, బాబు ప్రభుత్వం చేసిన చర్యలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జీఎస్టీ పెరిగి సాధారణ ప్రజల భారం పెరిగినా “బాబోరు తల్లికి వందనం అమలు చేస్తూ ప్రజలు బంగారం కొనేలా చేస్తున్నారంటూ” అంటూ పొగడ్తలతో వార్తలు రాస్తున్నారు.
ఇది జర్నలిజం కాదు.. ఇది రాజకీయ ప్రచారం. ఒకే అంశాన్ని పార్టీ ఆధారంగా వేరువేరు కోణాల్లో చూపడం మీడియా నైతికతకు విరుద్ధం. ప్రజల విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి ద్వంద్వ వైఖరులే కారణం.
ప్రజలు ఇప్పుడు ప్రతి వార్త వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీడియా సంస్థలు నిజాయితీగా వ్యవహరించకపోతే, కాలం గడిచేకొద్దీ వారి నమ్మకం పూర్తిగా కూలిపోతుంది.
నిజమైన జర్నలిజం అంటే.. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల వాదనలను వినిపించడం, పార్టీకి కాదు.. దేశానికి సేవ చేయడం.