డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మౌనంగా కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల విజయవాడలో ఆటో డ్రైవర్ల పథక కార్యక్రమంలో ఆయన ముభావంగా కనిపించిన నేపథ్యంలో కొన్ని గళాలు ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ చర్చ ప్రారంభించాయి.
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను మానసికంగా ప్రభావితం చేశాయని చెప్పబడుతోంది. అలాగే, పిఠాపురంలో జనసేనకు సంబంధించిన పరిణామాలు కూడా ఆయనలో అసంతృప్తిని సృష్టించాయని సామాజిక వర్గాలు ప్రచారం చేస్తున్నారు.
కానీ, జనసేన వర్గాలు ఈ ప్రచారం నిజం కాదని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ, సీఎం చంద్రబాబు, లోకేష్ అభ్యర్థన మేరకు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, పిఠాపురం పరిణామాల్లో ఆయన అసంతృప్తి లేనని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ మౌనం అసలు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకే సంబంధమని, రాజకీయ అసంతృప్తి ప్రచారం అని టీడీపీ అంటున్నా.. బాలయ్య వ్యాఖ్యల తర్వాతనే పవన్ మౌనం పాటించడంతో ఆ వ్యాఖ్యల బాగా బాధించాయని అర్థమవుతోంది. ఈ అసంతృప్తి కూటమిని ఏం చేస్తుందో చూడాలి.