Top Stories

ఏబీఎన్ లో మరోసారి యాంకర్ వెంకటకృష్ణ బరెస్ట్

తెలుగు న్యూస్‌ చానళ్ల లైవ్‌ డిబేట్లు ఇటీవల వార్తలకన్నా వివాదాలకు వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మెయిన్‌ స్ట్రీమ్‌ జర్నలిజం పేరుతో సాగుతున్న కొన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టిక్‌ విలువలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ లైవ్‌లో చోటు చేసుకున్న ఘటనను చెప్పుకోవాల్సి వస్తోంది.

మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న బుచ్చయ్యను డిబేట్‌కు ఆహ్వానించి, స్టూడియోలో గంటకు పైగా కూర్చోబెట్టడం, ఆయనపై వ్యాఖ్యలు చేయడం… చివరికి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా పంపించడం.. ఇదంతా జర్నలిజమా? లేక వ్యక్తిగత అజెండాతో సాగిన ప్రదర్శనా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. చర్చ పేరుతో అతిథిని పిలిచి, మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా కేవలం కామెంట్లతో సరిపెట్టడం యెల్లో మీడియా ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్న బుచ్చయ్యపై వచ్చిన కథనం గురించి ఈరోజు లైవ్‌లో వివరణ ఇస్తూ వెంకటకృష్ణ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వడం వరకు ఒకే. కానీ ఫ్రస్టేషన్‌లో “రేయ్”, “useless ఫెలోస్” వంటి పదాలు వాడటం మెయిన్‌ స్ట్రీమ్‌ జర్నలిజానికి ఎంతవరకు సమంజసం? అనే చర్చ మొదలైంది. లైవ్‌ టెలికాస్ట్‌లో, అది కూడా న్యూస్‌ చానెల్‌ యాంకర్‌ నోట నుంచి ఇలాంటి పదాలు రావడం మీడియా బాధ్యతపై సందేహాలు కలిగిస్తోంది.

న్యూస్‌ చానల్‌ అంటే కేవలం రేటింగ్స్‌ కోసం రెచ్చగొట్టే వేదిక కాదు. ప్రజలకు సమాచారం ఇవ్వడం, ప్రశ్నలు వేయడం, అధికారాన్ని ప్రశ్నించడం—ఇవే జర్నలిజం అసలు లక్ష్యాలు. కానీ వ్యక్తిగత కోపం, ఫ్రస్టేషన్‌ను లైవ్‌లో బయటపెట్టడం వల్ల చానెల్‌ విశ్వసనీయతే దెబ్బతింటుంది. అతిథిని పిలిచి, అతని మీద ఆరోపణలు చేస్తూ, సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకపోతే అది డిబేట్‌ కాదు…ఒకపక్షపు తీర్పు మాత్రమే.

ఈ ఘటన మరోసారి స్పష్టంచేస్తోంది—తెలుగు మీడియాకు ఆత్మపరిశీలన అవసరం. మాటల స్వేచ్ఛ పేరుతో అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు కొనసాగితే ప్రజల విశ్వాసం మరింత క్షీణిస్తుంది. మెయిన్‌ స్ట్రీమ్‌ జర్నలిజం తన ప్రమాణాలను తానే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

https://x.com/Samotimes2026/status/2007092965081231644?s=20

Trending today

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

చంద్రబాబు ఏపీ ద్రోహి.. నిజం బయటపెట్టిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు...

హిందూ ధర్మం.. ముస్లిం వ్యతిరేకం.. పవన్ నోట సంచలనం

తెలంగాణలోని కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ సంచలన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్ మీడియా వాతావరణంలో మరోసారి ‘ఎల్లో మీడియా’ అనే పదం పెద్ద...

దువ్వాడ ఆశలు గల్లంతు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్...

Topics

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

చంద్రబాబు ఏపీ ద్రోహి.. నిజం బయటపెట్టిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు...

హిందూ ధర్మం.. ముస్లిం వ్యతిరేకం.. పవన్ నోట సంచలనం

తెలంగాణలోని కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ సంచలన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్ మీడియా వాతావరణంలో మరోసారి ‘ఎల్లో మీడియా’ అనే పదం పెద్ద...

దువ్వాడ ఆశలు గల్లంతు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్...

వైయస్ షర్మిలకు ‘చివరి ఛాన్స్’

జాతీయస్థాయిలో తిరిగి బలపడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో...

వల్లభనేని వంశీకి భారీ ఊరట..

వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక...

రే.. రే.. కొడకా.. నీ అంతు చూస్తా

అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

Related Articles

Popular Categories