అప్పట్లో జగన్ ఇంటికెళ్లి వంగి వంగీ దండాలు పెడితే పచ్చ మీడియా బట్టలిప్పి భరతనాట్యం చేసింది. చిరంజీవి సహా సినీ ప్రముఖులు ఒక సీఎంను బతిమిలాడడమా? పోతే పోతాయి డబ్బులు, సినిమా టికెట్లు తగ్గుతాయి.. మీకెందుకు ఖర్మ అంటూ రెచ్చగొట్టారు పచ్చ మీడియా..
ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అయితే డబ్బులు తక్కువ అయితే ఏపీలో ఏమవుతుంది.. మిగతా రాష్ట్రాల్లో సంపాదించుకోండి.. అలా అవమానపడడం అవసరమా? అంటూ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ కు క్లాస్ పీకారు.
అయితే ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టారు. నాడు జగన్ తిట్టిన మురళీమోహన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్ద మాత్రం వంగి వంగీ మరీ శరణు జొచ్చారు.
జగన్ విషయంలో పెట్రేగిపోయిన మురళీ మోహన్, ఏబీఎన్ ఆర్కేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కుక్కిన పేనులా కుయ్యి మనకుండా ఉండడం చూసి అంతా ట్రోల్స్ చేస్తున్నారు.