ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ సోషల్ మీడియా వేదికగా విమర్శల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విశ్లేషణలు చేసే సమయంలో ఒకలా, పక్క రాష్ట్రమైన తెలంగాణపై స్పందించేటప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి..సబ్ స్క్రైబ్ చేయండి.. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి
ఇక వార్తలోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెటైర్లు వేస్తూ, చర్చలు నడిపేటప్పుడు అది చాలా “కమ్మగా” వింతగా అనిపిస్తుందని.. అదే తరహా వెటకారం తెలంగాణ రాజకీయాలపై చూపిస్తే మాత్రం ఎందుకు “నొప్పి” పుడుతోందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. “తనకు వస్తే రక్తం.. పక్కోడికి వస్తే టమాటా పప్పు” అన్న చందంగా వెంకటకృష్ణ వైఖరి ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.వెంకటకృష్ణ గారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ జనం రకరకాల మీమ్స్ ట్రోల్స్ తో విమర్శిస్తున్నారు.
జర్నలిజం అనేది నిష్పక్షపాతంగా ఉండాలని, “ఊరందరిదీ ఒక దారి.. ఉలిపికట్టెది ఒక దారి” అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రాంతీయ భావజాలంతో వార్తలను వండి వార్చడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, ఏబీఎన్ వెంకటకృష్ణ మార్క్ జర్నలిజం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


