చంద్రబాబుకు “ప్రకృతి వైపరీత్యాలను ఆపగల శక్తి ఉంది” అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రజలు నవ్వులు ఆపుకోలేని పరిస్థితి ఏర్పడింది. మహా టీవీ యాంకర్ వంశీ చేసిన ఈ ఓవర్ ఎలివేషన్లపై ఎప్పటిలాగే సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మొదలైంది.
ఈ నేపథ్యంలో ఏబీఎన్ చర్చలో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి. వంశీ ఎలివేషన్లు పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సెటైర్లు చర్చాంశమయ్యాయి. “ఏ మనిషికైనా ప్రకృతి వైపరీత్యాలను ఆపగల శక్తి ఉండటం సాధ్యమా? ఎవడన్నా అలాంటిదేమైనా చేయగలడా? ఇటీవలి కాలంలో కొందరు చేస్తున్న ఎలివేషన్లు చూస్తే నవ్వు వస్తోంది,” అంటూ వెంకటకృష్ణ వ్యాఖ్యానించాడు.
అదే సమయంలో ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశాడు. “చంద్రబాబు స్వయంగా ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి వల్లా కాదు అని చెప్పారు. అలాంటి సందర్భంలో కూడా ఇలాంటివి చెప్పడం చూడగానే నవ్వు వస్తుంది,” అని స్పష్టం చేశాడు.
ఇక సోషల్ మీడియాలో ‘ఎల్లో మీడియా’గా విమర్శలు ఎదుర్కొంటున్న వర్గం చంద్రబాబుకు ఇస్తున్న అతిశయోక్తి ఎలివేషన్లు ప్రజల్లో వినోదానికే కారణమవుతున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాజకీయ మద్దతు ఉన్నా, మీడియా బాధ్యత మరువకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వంశీ చేసిన ఓవర్ ప్రశంసలు, ఆపై వాటిపై వచ్చిన ట్రోలింగ్, ఇప్పుడు ఏబీఎన్ వెంకటకృష్ణ చేసిన సెటైర్లు.. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

