Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ విలవిల!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఆ రోజు రాత్రి అగ్నిప్రమాదం తప్పింది కానీ, ఏబీఎన్ వెంకటకృష్ణ గారి గుండె మాత్రం అమరావతి గుర్తించబడకపోవడం అనే మహా విషాదంతో బద్దలైపోయింది! స్క్రీన్ మీద అక్షరాలు పరిగెడుతున్నాయి – “అమరావతిని గుర్తించండి!” – కానీ ఎవరండీ గుర్తించేది? వెంకటకృష్ణ గారి గొంతులో ఆవేదన, కళ్ళలో ఆక్రోశం, మాటల్లో ఆవేశం… అబ్బో, ఆ బాధ అంతా ఇంతాకాదు! “ఇప్పటివరకు అమరావతికి చట్ట భద్రత లేదు!” అని ఆయన ఆవేశంగా అంటున్నారు. అంటే, రేపు పొద్దున్న ఎవరైనా వెళ్లి “ఈ అమరావతి నాకు నచ్చలేదు, దీన్ని నేనే తీసుకుపోతాను!” అంటే లీగల్ గా ఆపడానికి కూడా పత్రాలు లేవన్నమాట! ఎంత దారుణం!”పార్లమెంట్ అమరావతిని ఆమోదించలేదు!” – అంటే మన ఎంపీలంతా కలిసి పార్లమెంట్ లో కూర్చుని “అమరావతి అనేది ఒకటి ఉంది… ఉందా? లేదా?” అని డిబేట్ చేసి, ఓటింగ్ పెట్టి, “ఉంది!” అని తీర్మానం చేయలేదన్నమాట! బహుశా పార్లమెంట్ సభ్యులంతా అమరావతిని ‘అమరావతి’ కాకుండా ‘అమ… ఏదో ఒకటి’ అని పిలుస్తున్నారేమో!

“గెజిట్ లో కనబడదు!!” – ఇది ఇంకో ఘోరం! ప్రభుత్వ గెజిట్ అంటే అదో పవిత్ర గ్రంధం కదా! దాంట్లోనే లేదంటే, అమరావతిని అధికారికంగా ఒక ‘అపోహ’ కింద జమ కట్టేసి ఉంటారన్నమాట! “కనీసం పోస్టులో కూడా పేరు ఉండదు!” – ఇది వినగానే నా గుండె తరుక్కుపోయింది! ఇప్పుడు అమెరికాలో ఉన్న మా బంధువులు అమరావతిలో ఉన్న వాళ్ళకి పార్సిల్ పంపాలంటే ఎలా? అడ్రస్ దగ్గర ‘అమరావతి’ అని రాస్తే, పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని ఎక్కడ వెతుకుతాడు? విజయవాడలోనా? గుంటూరులోనా? లేక వైకుంఠంలోనా? పాపం, లారీల లారీల కొద్దీ పోస్టల్ బస్తాలు ‘అమరావతి అడ్రస్ లేనివి’ అని ఒక మూల పడి ఉన్నాయేమో!

కానీ వీటన్నిటినీ మించి, వెంకటకృష్ణ గారిని అత్యంత తీవ్రంగా కలచివేసిన, నిద్ర పట్టనివ్వకుండా చేసిన మహా విషాదం ఏమిటంటే… “ఆఖరికి టీవిలో ఉష్ణోగ్రత కూడా చెప్పరు!!” అయ్యో పాపం! ఒక నగరం ఉందా లేదా అని నిర్ణయించేది దాని ఉష్ణోగ్రత రిపోర్టే కదా! టీవీలో వాతావరణ వార్తలు చెప్పేటప్పుడు, అన్ని ఊర్ల పేర్లు చెప్పి, చివరికి ‘ అమరావతి లో ఉష్ణోగ్రత తెలియదు’ అని చెప్పట్లేదన్నమాట! దీని వల్ల ఏం జరుగుతుంది? అమరావతిలో ఉన్నవాళ్ళు ఉదయం లేవగానే చలిగా ఉందో, ఎండగా ఉందో తెలియక ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నారు! ఎక్కడికైనా బయటికి వెళ్దామనుకుంటే, గొడుగు తీసుకెళ్లాలో లేక స్వెట్టర్ వేసుకెళ్లాలో తెలియక గందరగోళ పడిపోతున్నారు!

“ఇదే మన బాధ… మన ఆవేదన!” అంటూ వెంకటకృష్ణ గారు చంద్రబాబు పాలన లోపాలను, మోడీ ప్రభుత్వ నిష్క్రియతను దుమ్మెత్తిపోశారు. “ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అమరావతిని గుర్తించలేదు?” అని నిలదీశారు.

ఏదేమైనా, వెంకటకృష్ణ గారి ఆవేదన చూస్తుంటే, అమరావతికి చట్ట భద్రత, పార్లమెంట్ ఆమోదం, గెజిట్ గుర్తింపు కంటే ముందుగా ఒక మంచి ‘డిజిటల్ థర్మామీటర్’, ఒక ‘అధికారిక వెదర్ రిపోర్టింగ్ ఏజెన్సీ’ అవసరం అని బలంగా అర్థమైంది! అప్పుడే కదా, టీవీలో ఉష్ణోగ్రత చెబుతారు! అప్పుడే కదా, అమరావతి ఒక నిజమైన నగరంగా ప్రపంచానికి తెలుస్తుంది! లేదంటే, అది ఏబీఎన్ చర్చల్లో వెంకటకృష్ణ గారి గుండెల్లో మాత్రమే ఒక మండుతున్న నిజంగా మిగిలిపోతుంది! హా! ఎంతటి విషాదం!!

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories