ABN Venkatakrishna : అల్లు అర్జున్ పై ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

ABN Venkatakrishna : ఏబీఎన్ వెంకటకృష్ణ ఫస్ట్రేషన్ తో ఊగిపోయాడు. ఎంతలా అంటే చంద్రబాబునే కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పోటీగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరును తట్టుకోలేకపోయాడు. అందుకే తన ఏబీఎన్ చానెల్ లో డిబేట్ పెట్టి మరీ.. ‘ఏయ్ అల్లు అర్జున్ నువ్వు చేస్తుంది తప్పు.. సీఎం అంటే అంత చులకనా.. ’ అంటూ వెంకటకృష్ణ వార్నింగ్ ఇచ్చేశాడు.

గతంలో చంద్రబాబు అంటే అన్నీ కోసేసుకునే ఏబీఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు తన చంద్రబాబుకు జిగ్రీ దోస్త్ అయిన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కాపు కాస్తున్నాడు. అల్లు అర్జున్ తీరు సరిగా లేదని.. ఆయన రేవంత్ రెడ్డికి సారీ చెప్పాల్సి ఉందని.. కానీ అలా చెప్పకుండా ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

రేవంత్ రెడ్డి చేసేదే న్యాయం అని.. నాగార్జున ఎన్ కన్వేన్షన్ సెంటర్ కూల్చివేయడం చట్టపరంగా చేసిందని.. అల్లు అర్జున్ కూడా ఇలా ఎదురుతిరగడం ఏమాత్రం మంచిది కాదని ఏబీఎన్ వెంకటకృష్ణ హితవు పలికారు.

అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డిని ఖాతరు చేయడం లేదని.. ఆయన్ను గుర్తించడం లేదంటూ ఏబీఎన్ వెంకటకృష్ణ వాపోయాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎవరైనా కూడా ప్రభుత్వాలకు, అధికారులకు అణిగిమణిగి ఉండాలంటూ వెంకటకృష్ణ వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం వైరల్ అయ్యింది.

వీడియోతో మెయిల్ చేయండి