తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వరుస ఆరోపణలు, వివాదాల నడుమ ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ కొత్త సంచలనాన్ని విసిరారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావిస్తూ, తిరుమల కొండపై కొందరు భక్తుల వేషంలో రోజంతా తిరుగుతూ అన్నప్రసాదాలు తిని, సాయంత్రం మద్యం సేవిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
వెంకటేశ్వర స్వామి సన్నిధి పవిత్రతకు భంగం కలిగించే ఈ ప్రవర్తనపై వెంటనే చర్యలు తీసుకోకపోతే భక్తుల కోపానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం గురవుతుందని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు “టీటీడీ వైఫల్యాలను ఎల్లోమీడియా కూడా ఎత్తి చూపుతుందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది” అంటూ విమర్శలు చేస్తున్నారు. భక్తులు మాత్రం టీటీడీ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.https://x.com/Samotimes2026/status/1967966070100426876