Top Stories

మధ్యతరగతి నుంచి రూ. 700 కోట్ల సామ్రాజ్యాధిపతి ఈ తెలుగు నిర్మాత  

సాధారణంగా ధనవంతుల పిల్లలు కూడా ధనవంతులు కావడం సహజం. కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన సొంత ప్రతిభతో ఊహించని స్థాయిలో విజయం సాధించడం నిజమైన గెలుపు. అలాంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని గడుపుతున్న తెలుగు నిర్మాత, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆదిత్యారామ్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, జగన్నాధపురంకు చెందిన ఆదిత్యారామ్ బాల్యం ఒక మధ్యతరగతి కుటుంబంలో గడిచింది. అయితే, తనదైన పట్టుదల, ప్రతిభతో చెన్నైకి చేరుకున్న ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించారు. ఆదిత్య గ్రూప్ ను స్థాపించి అనేక విజయవంతమైన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు.

అంతేకాదు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన ‘సందడే సందడి’, ‘ఖుషి ఖుషి గా’, ‘ఏక్ నిరంజన్’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నప్పటికీ ఆయన అసలు ఘనత రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది.

ఆదిత్యారామ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం ఏమిటంటే… ఆయన చెన్నైలోని పనైయూర్‌లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరమైన, విశాలమైన భవనాన్ని నిర్మించారు. ఈ రాజభవనం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భవనంలో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన కార్లు మరియు కావలసిన ఏర్పాట్లు చేసుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం ఆదిత్యారామ్ నికర విలువ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ. 700 కోట్లుగా అంచనా వేయబడింది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన కేవలం ధనార్జనకే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ పేదలకు సౌకర్యాలు కల్పిస్తూ ఆదిత్యారామ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

చిన్ననాటి పేదరికం నుంచి నేడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ అద్భుతమైన భవనాన్ని నిర్మించిన ఆదిత్యారామ్ ప్రయాణం… జీవితంలో పైకి ఎదగాలని కలలు కనే నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories