ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో టిడిపి నేతలను ఒక వ్యక్తి బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని చెప్పాడు. ఆపై ఏఐ సాయంతో ఉమా మాదిరిగా వీడియో కాల్ చేసి, “టిడిపి కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం” అని కోరాడు. నమ్మిన నేతలు 35 వేల రూపాయలు పంపించారు.
తర్వాత అదే వ్యక్తి చంద్రబాబు మాదిరిగా వీడియో కాల్ చేసి “విజయవాడకు రండి, అమరావతిలో కలుద్దాం” అంటూ పదివేల రూపాయలు అడిగాడు. అనుమానం వచ్చిన నేతలు పోలీసులను సంప్రదించగా, అసలు ఉమా ఎటువంటి కాల్ చేయలేదని తేలింది.
దర్యాప్తులో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఏఐ సాయంతో ఈ మోసం చేసినట్లు తెలిసింది. పరువు పోతుందనే భయంతో టిడిపి నేతలు పెద్దగా హంగామా చేయకుండానే హోటల్ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు.