Top Stories

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ భారీ చిత్రానికి భారీ అంచనాలు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రీమియర్ షోస్ మాత్రమే కాదు, థియేట్రికల్ రిలీజ్ కూడా అనుమానాస్పదంగా మారింది.

సమాచారం ప్రకారం, నిర్మాతలు 14 రీల్స్ సంస్థకు పాతకాలం నుంచి ఉన్న ఫైనాన్షియల్ బకాయిలే ప్రధాన సమస్యగా చెప్పుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే మరియు ఆగడు చిత్రాలను 14 రీల్స్ – EROS కలిసి నిర్మించగా, భారీ నష్టాలు చవిచూశారు. ఆ ఒప్పందం ప్రకారం 14 రీల్స్ సంస్థ EROS‌కు సుమారు 28 కోట్ల రూపాయల బకాయి చెల్లించాల్సి ఉంది. అయితే ఆ మొత్తం ఇంతవరకు క్లియర్ కాలేదని తెలుస్తోంది.

EROS‌తోపాటు IVY ఎంటర్టైన్మెంట్స్ సహా మరో మూడు సంస్థలకు కూడా బకాయిలు ఉన్నట్లు టాక్. మొత్తం కలిపి సుమారు 60 కోట్ల బకాయి తీర్చకపోతే ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాని పరిస్థితి కనిపిస్తోంది.

ఇక అభిమానుల ఆశలు మాత్రం ప్రీమియర్ షోస్ క్యాన్సిలేషన్‌తో కుంగిపోయాయి. ఈరోజు రాత్రికే సమస్యలు పరిష్కరించే అవకాశం చాలా తక్కువగా ఉందని ట్రేడ్ టాక్స్ చెబుతున్నాయి. బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగితే లేదా ప్రభుత్వ స్థాయిలో జోక్యం జరిగితే మాత్రమే ఈ సమస్య కొలిక్కి రావచ్చని అంటున్నారు పరిశ్రమ వర్గాలు.

ఇప్పుడు చూడాల్సిందల్లా అఖండ 2 ఈ వారం విడుదల అవుతుందా? లేదంటే పూర్తిగా వాయిదాపడుతుందా? అని.. అభిమానులు మాత్రం రిలీజుకు గ్రీన్ సిగ్నల్ రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

https://x.com/AndhraBoxOffice/status/1996566097496285537?t=ZSw2uyRnS8EyX0eA6JaJCA&s=08

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories