Top Stories

అమ్మకు నిల్‌.. నాన్నకు ఫుల్‌ పోసేస్తున్న ’బాబు’, వీడియో వైరల్‌

కంచం, చెంబూ బయట పారేసి, రాయి, రప్ప లోపల వేసుకున్నట్టు’ తయారైంది రాష్ట్రంలోని మహిళలు పరిస్థితి. గడిచిన ఐదేళ్లు  వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకం కింద ఒక్కో స్కూల్‌కు వెళ్లే చిన్నారులు తల్లులకు రూ.15 వేలు చొప్పున అందించారు. ఈ మొత్తంలో రెండు వేలు రూపాయలను స్కూల్‌ నిర్వహణ కోసం పాఠశాలకు అందించేలా చేయగా, మిగిలిన రూ.13 వేల రూపాయలను విద్యార్థుల తల్లుల వద్దే ఉంచుకునేవారు. ఎన్నికలు సమయంలో చంద్రబాబు నాయుడు రూ.15 వేలు చొప్పున ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో అనేక హామీలను ఊదరగొట్టారు. తీరా ఎన్నికలు అయిపోయాయి. సూపర్‌ సిక్స్‌ అడిగితే నిధులు లేవంటున్నారు. తల్లికి వందనం ఎప్పుడు నుంచి ఇస్తారని ప్రశ్నిస్తుంటే.. లెక్క తేలాల్సి ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని మహిళలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్‌ బాబు ఉండుంటే ఈపాటికీ అమ్మ ఒడి ఎప్పుడో అందుండేదంటూ మహిళలు వాపోవడం వారి వంతయింది.

పథకాలు ఏవీ అమలు చేయకుండా అమ్మకు నిల్‌ చేసిన చంద్రబాబు సర్కార్‌ మాత్రం నాన్నకు ఫుల్‌ పోస్తోంది. నూతన మద్యం విధానాన్ని మాత్రం జెట్‌ స్పీడ్‌తో అమలు చేసి తెలుగు తమ్ముళ్లకు మద్యం దుకాణాలను కట్టబెట్టేసింది. ఇప్పుడు వారంతా మద్యం దుకణాలను చేజిక్కించుకుని నచ్చిన రేట్లకు మందు అమ్ముతూ దోచుకుంటున్నారు. మందేసిన బాబులు చిందేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటే, తల్లులు మాత్రం పథకాలు లబ్ధి అందక మొర్రోమంటున్నారు. మందుబాబు ఒకరు ఫుల్‌గా వేసి చిందేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు తల్లికి వందనం కావాలంటే లెక్కలుండాలి.. అదే నాన్నకు ఫుల్‌ పోయాలంటే లెక్క ఉంటే చాలు అని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అమ్మ ఒడి పథకానికి నాన్న బుడ్డీ అమ్మి జగన్‌ ఇస్తున్నాడని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు బాబు అమ్ముతున్న బుడ్డీ సొమ్మును అమ్మలకు ఇవ్వకుండా ఎవరి జేబుల్లోకి పంపిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అతిగా ఆశపడిన ఆడది.. అతిగా ఆవేశపడిన మగాడు చరిత్రలో బాగుపడినట్టు లేదంటూ ఒక సినిమాలో రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్‌ను పలువురు ఉదహరిస్తున్నారు. చంద్రబాబు సంగతి తెలిసి కూడా రెండు వేలు అదనంగా వస్తుందని ఆశపడి ఓట్లేసిన మహిళలు ఇప్పుడు బాధపడాల్సి వస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నాన్నలకు ఫుల్‌ పోస్తున్న బాబు.. మరి తల్లులకు ఎప్పుడు అమ్మకు వందనం వేస్తారో చూడాల్సి ఉంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories