అల్లు అర్జున్ కు బెయిల్.. హర్ట్ అయిన ఏబీఎన్ వెంకటకృష్ణ.. వైరల్ వీడియో

అల్లు అర్జున్ కు వైసీపీ కీలక లాయర్లు వాదించి బెయిల్ ఇప్పించడంపై పాపం ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ బెయిల్ రాదు కావచ్చని అనుకున్నాడు వచ్చేసరికి.. బన్నీకి వైసీపీ లాయర్లు, బీఆర్ఎస్ నేతలు, జగన్ సపోర్టుగా ట్వీట్లు చేసేసరికి వెంకటకృష్ణ తట్టుకోలేకపోయాడు.

బన్నీ అరెస్ట్ కాగానే మొదట స్పందించిన నేత కేటీఆర్.. అల్లు అర్జున్ కి మద్దుతుగా ట్వీట్ చేశాడు. లగచర్లలో రైతు చావుకు కారణమైన రేవంత్ రెడ్డిని, ఆయన సోదరుడిని కూడా ఇలానే అరెస్ట్ చేయాలంటూ కామెంట్ చేశాడు. బన్నదీ తప్పు అయితే రేవంత్ రెడ్డిది కూడా తప్పేనంటూ స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ కు మద్దుతుగా మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో తమ పార్టీ తరుఫున ప్రచారానికి వచ్చిన అల్లు అర్జున్ కు తన సంపూర్ణ మద్దతును తెలియజేశాడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. అంతేకాదు అల్లు అర్జున్ కు బెయిల్ రావడంలో కీలకంగా పనిచేసిన లాయర్ నిరంజన్ రెడ్డితోపాటు మరో ఇద్దరు లాయర్లు జగన్ తరుఫువారే. జగన్ కేసులు వాదిస్తున్నవారే.. వారే అల్లు అర్జున్ తరుఫున బలంగా వాదించి బెయిల్ ఇప్పించారు.

దీన్ని జీర్ణించుకోలేని ఏబీఎన్ వెంకటకృష్ణ.. ‘జగన్ లాయర్లు అల్లు అర్జున్ తరుఫున వాదించారు.. జగన్, కేటీఆర్, హరీష్ అంతా నడిపించారు. ఇంకేముంది బెయిల్ వచ్చింది’ అంటూ నిట్టూర్చాడు. ఏబీఎన్ వెంకటకృష్ణ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి