ప్రఖ్యాత తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య గారియైన అల్లు కనకరత్నం వయసు 94 సంవత్సరాల్లో కన్నుమూశారు. ఆమె మరణం తెలుగు సినీ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
అల్లు రామలింగయ్య సినీ జీవితంలో రాణించే సమయంలో కుటుంబ బాధ్యతలన్నింటినీ భుజస్కందాలపై వేసుకుని, పిల్లల పెంపకాన్ని, గృహ నిర్వహణను సమర్థంగా చూసుకుంది కనకరత్నమే. చెన్నై నుండి హైదరాబాద్ వరకు జీవన మార్పుల్లోనూ, పిల్లల చదువులు, పెంపకం, కుటుంబ సజావు అన్నీ ఆమె చేతులమీదుగా సాగాయి.
ఇక చిరంజీవి అల్లు వారి అల్లుడిగా మారడంలో కూడా కనకరత్నం కీలక పాత్ర పోషించారు. తన చిన్న కుమారుడిని కోల్పోయిన బాధలో ఉండగా, అతని జ్ఞాపకాల్లో చిరంజీవి తన కుమారుడి రూపం కనబడింది. అప్పటినుండి సురేఖను చిరంజీవికే ఇచ్చి పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయించుకుని, రామలింగయ్యపై ఒత్తిడి తెచ్చారు. అలా మెగాస్టార్ చిరంజీవి అల్లు కుటుంబంలో అల్లుడిగా అడుగుపెట్టడానికి కారణం కనకరత్నమే.
చిరంజీవి అనేక సందర్భాల్లో కనకరత్నం తనను ఎంతగా ప్రేమించేవారో గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆమె మరణంతో ఆ జ్ఞాపకాలను తలచుకుని తల్లడిల్లిపోతున్నారు. అల్లు కుటుంబం, కొణిదెల కుటుంబాల ఎదుగుదల వెనుక కనకరత్నం త్యాగం, సహనమే ప్రధాన బలమని చెప్పుకోవచ్చు.