వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన హుషారైన పాటలకు తనదైన స్టెప్పులతో సందడి చేశారు. డప్పు చప్పులతో సాగిన సంబరాల్లో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
గత అనుభవాల నేపథ్యంలో ఈసారి డాన్స్ చేయరనే అంచనాలు ఉన్నా, వాటికి అంబటి రాంబాబు చెక్ పెట్టారు. వైసీపీతో పాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు సంబంధించిన పాటలకు డ్యాన్సులతో అలరించారు. భోగి వేడుకల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో వేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
“సంబరాల రాంబాబు” అనే పేరు తనకు ఆనందం ఇస్తుందని, విమర్శలే తనకు ఆ గుర్తింపు తెచ్చాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ పేరు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని చెప్పుతూ తాను దాన్ని గర్వంగా అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన డాన్స్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://x.com/greatandhranews/status/2011257549400785376?s=20

