Top Stories

చంద్రబాబుకు కరెంట్ అమ్ముతున్న రాధాకృష్ణ!

ఇప్పుడు ఇది సూరవరం ప్రతాపరెడ్డి రోజులు కాదు. రామ్ నాథ్ గోయెంకా రోజులు అయితే అసలే కాదు. పత్రికా రంగం ఇక ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం అనే భావనకీ దూరమవుతోంది. ప్రజల సమస్యలు మాత్రమే వెలికి తీసే పత్రికలు గోల్కొండ గారిది లాంటి నిజాయితీతో పనిచేసే రోజులూ కావు.

ఈ రోజుల్లో పత్రిక యజమానులకు రాజకీయ రంగులు ఉంటాయి. రాజకీయ సంబంధాలు, వాసనలు ఉంటాయి. రాజకీయ నాయకులతో మమేకం అవ్వడం సహజం. రాజకీయ పార్టీకి డప్పు కొట్టే అవసరం కూడా ఉంటుంది. పత్రికలు నడుపడమంటే ఒక వ్యాపారం. ఆ వ్యాపారంలో పనిచేసే వారు ఉద్యోగులు, వారికి జీతాలు, భవిష్యనిధులు, జీత పెంపులు ఇవ్వాలి. ఇవన్నీ సాధించాలంటే యాజమాన్యాలు ‘న్యూట్రల్‌’గా ఉండడం సాధ్యం కాదు. అలా ఉంటే ఎక్కువగా లాభాలు రావు. అందుకే యాజమాన్యాలు ఎంచుకున్న రంగులో ఆడతాయి. కొందరు యజమానులు పార్టీ కార్యకర్తలకంటే ఎక్కువగా పార్టీకి ప్రచారం చేస్తారు. ప్రతి పత్రిక యాజమాన్యం వెరైటీ.

తెలుగు రాష్ట్రాల్లో టిడిపి అనుకూల మీడియాగా ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఒకటి. ఇది ఎవరి ఆరోపణల వల్ల వచ్చిన పేరు కాదు. రెండు శాసనసభల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పత్రికలని బహిరంగంగానే ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, టీవీ5లపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి తెరచాపగా టిడిపికి మద్దతు ఇచ్చిన పత్రికగా నిలిచింది. జగన్ ప్రభుత్వాన్ని ఉతుక్కుపోయినట్లు ఉతికేసింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకు టిటిడి చైర్మన్ పదవి దక్కింది. కాస్త ఆలస్యంగా అయినా ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కూడా లైన్‌లోకి వచ్చారు. అయితే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ రాలేదు, కానీ మరో రకంగా లాభం లభించింది. ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పవర్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. రాధాకృష్ణకు ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్‌పై 1.54 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రం నుంచి వచ్చే 15 సంవత్సరాల పాటు విద్యుత్‌ను ఏపీ సీపిడిసిఎల్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. 2025 జూన్ 1 నుంచి యూనిట్‌కు ₹2.50 చెల్లిస్తారు. ఈ టారీఫ్ విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదని, అవసరానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

 

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories