ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలనపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్లతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. అయితే, గంటల తరబడి సాగిన ఈ సమావేశంలో సీఎం క్లాస్ వినలేక కొందరు మంత్రులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీటింగ్‌లో కునుకు తీస్తూ కనిపించారు. చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగిస్తుండటంతో, అలసట వల్లనో లేదా సబ్జెక్ట్ బోర్ కొట్టడం వల్లనో గానీ, ఆయన గాఢ నిద్రలోకి జారుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. “బాబు మాట.. నిమ్మల నిద్ర” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
మరోవైపు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సుదీర్ఘ ప్రసంగం పట్ల పెద్దగా ఆసక్తి చూపలేకపోయారని వీడియోలు సూచిస్తున్నాయి. ఆయన పదేపదే ఫోన్ చూసుకోవడం, ఆవలింతలు తీస్తూ కనిపించడం గమనార్హం. బాబు గారి ‘సోది’ భరించలేక పవన్ ఇలా చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు సాధారణంగానే ఏదైనా అంశంపై గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కలెక్టర్ల మీటింగ్ మరీ సుదీర్ఘంగా సాగడంతో, మంత్రులకే ఓపిక నశించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
“పాలనపై సమీక్షలు అవసరమే కానీ, మంత్రులే నిద్రపోయేలా మీటింగ్‌లు ఉంటే ఎలా?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం “సుదీర్ఘ పని వేళల వల్ల మంత్రులు అలసిపోయి ఉండవచ్చు” అని సమర్థిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా వింగ్స్ ఈ దృశ్యాలను షేర్ చేస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నాయి.
https://x.com/Anithareddyatp/status/2001224949638295635?s=20

