Top Stories

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతోందని, అదే తరహాలో ఏపీలోనూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనాభా పెరగకపోతే రాష్ట్ర అభివృద్ధికి ప్రమాదం తప్పదని ఆయన అన్నారు.

తాజాగా తొలి వెలుగు సభలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలంటే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇక వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసం ఈ నిబంధనను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అసలు 1994లో తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, జనాభా తగ్గుతుండటంతో అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోందని అన్నారు.

ఒకానొక సమయంలో “ఇద్దరు హద్దు.. ఒకరు ముద్దు” అనే నినాదం నడిచినా, ఇప్పుడది సరైనది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువత శాతం తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఈ ప్రభావాలేనని తెలిపారు. “జనాభా పెరిగితేనే కేంద్ర నిధులు, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి” అని చంద్రబాబు వివరించారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ఆ రాష్ట్రాలకు జనాభా ఆధారంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలూ పెరిగాయి. ఏపీలోనూ అలాంటి పరిస్థితి రావాలి” అని చెప్పారు.

ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను తొలగిస్తూ చట్టసవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2001లో ఏపీలో సంతానోత్పత్తి రేటు 2.6%గా ఉండగా, ప్రస్తుతం అది 1.5%కి పడిపోయిందని వెల్లడించారు. ఇది ఆందోళనకరమైన అంశమని సీఎం తెలిపారు.

సంప్రదాయ కుటుంబ నియంత్రణ విధానాలపై మళ్లీ ఆలోచన అవసరమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేయడం విశేషం. జనాభా పెంపుతోనే రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories