ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై పడుతున్న పన్నుల భారాన్ని సమర్థిస్తూ కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల లైఫ్‌టైమ్ ట్యాక్స్‌పై 10 శాతం సెస్ విధించడాన్ని “బాదుడు కాదు.. బాగుకే” అంటూ సమర్థించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన మీడియా, ప్రజలపై భారం మోపే నిర్ణయాలను సమర్థించడం అనైతికమని విమర్శకులు అంటున్నారు. జగన్ హయాంలో అయితే ఇదే అంశాలను అడ్డగోలుగా రాసిన మీడియా, ఇప్పుడు మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పన్నులు, సెస్‌లు, యూజర్ ఛార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపుతున్నా ప్రశ్నించని ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజల పాలిట శాపంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


