ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి తన ప్రజా పరిరక్షణ దృక్పథాన్ని చాటారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రాజుపేట వద్ద ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలను స్వయంగా అడ్డగించి తనిఖీ చేశారు. విశాఖ గంగవరం పోర్టు నుంచి పయనీర్ కంపెనీకి ముడి సరుకులు తరలిస్తున్న ఈ ట్రక్కులు సామర్థ్యానికి మించి లోడుతో వెళ్తున్నట్లు స్పీకర్ గుర్తించారు.
తాళ్లపాలెం వంతెన దెబ్బతినడం, రోడ్లు ధ్వంసం కావడం వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగారు. సంబంధిత శాఖల అధికారులకు సీరియస్ ఆదేశాలు ఇచ్చి, ట్రక్కులను వెంటనే సీజ్ చేయాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం స్పీకర్ చొరవ
స్థానికులు స్పీకర్ చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలపై ఆయన స్పందనను ప్రశంసిస్తున్నారు