ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన “రెడ్ బుక్” వివాదానికి సంబంధించి తాజాగా వైసీపీ రూపొందించిన యాప్‌పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్ వేశారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి బాధితులుగా మారిన తమ పార్టీ కార్యకర్తల కోసం ఓ యాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించగా, దానిపై బీజేపీ నేత సత్యకుమార్ ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.
“అన్న పోలీసులు పట్టుకున్నారు… కాపాడన్నా!” అంటూ ఒక సెటైరికల్ పోస్ట్‌లో 11 స్టెప్స్‌తో విరుచుకుపడ్డారు. దీనిని “సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న క్రియేటివ్ పోస్ట్”గా అభివర్ణిస్తూ, ఆ పోస్ట్‌ను షేర్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైసీపీ వర్గాలు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన యాప్ ను మేనేజ్ చేయాల్సిన పరిస్థితేనా? అంటూ విరుచుకుపడుతున్నాయి. దీంతో, వైసీపీ యాప్ చర్చకు తెరతీసినప్పటికీ, దాని చుట్టూ రాజకీయం మరింత వేడెక్కుతోంది