బిగ్ బాస్ షోలో ఈసారి ‘అగ్నిపరీక్ష’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు ప్రసారం కాగా, 45 మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ దక్కనుంది.
ఈ క్రమంలోనే ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్. తనకు సినిమాలు, రియాల్టీ షోలు అంటే ఆసక్తి ఉండటంతో బిగ్ బాస్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఆర్మీ నుంచి ప్రత్యేకంగా లీవ్ తీసుకుని వచ్చిన ఆయన, విజేతగా నిలిస్తే ఆర్మీ ఉద్యోగాన్నే వదిలేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఆర్మీ అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే దేశభక్తిని ప్రతిబింబించే టాస్కులు కూడా వచ్చే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాక, ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ వల్ల కఠినమైన టాస్కులనూ ఈజీగా పూర్తి చేయగలడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దాంతో ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతాడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.