Top Stories

టీడీపీని చావుదెబ్బ కొట్టిన అర్నాబ్ గోసామీ

జాతీయ మీడియా అంటే ఏమిటో మరోసారి నిరూపించారు రిపబ్లిక్ టీవీ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పాలి… కానీ టీడీపీ మాత్రం సమాధానాలకి బదులు బహిష్కరణ బాట పట్టింది. రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తామంటూ టీడీపీ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అర్నబ్ అడిగిన ప్రశ్నలకు ఎదురుగా నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయాలకు తెలిసిన వారు అంటున్నారు. కానీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయనే కారణంతో మీడియాను టీడీపీ బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం కాదా అన్న సందేహం తలెత్తుతోంది.

ఇక ఈ అంశంపై నారా చంద్రబాబు నాయుడుకు కూడా రాజకీయ వర్గాల నుంచి పరోక్షంగా సూచనలు వస్తున్నాయి.
“బహిష్కరణలపై దృష్టి పెట్టడం కంటే… మీ మంత్రులు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించేలా చూడండి” అన్న మాటలు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో మీడియా ప్రశ్నించడం సహజం. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటమే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల బాధ్యత. ప్రశ్నలు అడుగుతుంటే బహిష్కరిస్తామనడం ద్వారా ప్రజలకు తప్పు సంకేతాలు వెళ్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా? లేక మరింత నష్టం తెచ్చిపెడుతుందా? అన్న చర్చ ఊపందుకుంది. ఎందుకంటే ఒక మీడియా ఛానెల్‌ను బహిష్కరించినంత మాత్రాన రిపబ్లిక్ TV ప్రభావం తగ్గిపోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ బహిష్కరణలకు రిపబ్లిక్ TVపై ‘సున్నా ప్రభావం’ తప్ప, ప్రజల్లో టీడీపీపై వచ్చే అభిప్రాయంపై మాత్రం గట్టి ప్రభావం పడే అవకాశముంది.

ప్రశ్నల నుంచి పారిపోవడం రాజకీయం కాదు. ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పడమే అసలైన నాయకత్వం. అర్నబ్ వేసిన స్ట్రైట్ షాట్లకు బహిష్కరణలే సమాధానమైతే… టీడీపీ రాజకీయానికి ప్రజలే అసలైన తీర్పు చెప్పడం ఖాయం.

మొత్తంగా విమానాయాన శాఖ మంత్రి గా రామ్మోమన్ నాయుడుని ప్రశ్నించిన అర్నాబ్ ను టీడీపీ బహిష్కరించింది. అయితే టీడీపీని ప్రశ్నించి చావుదెబ్బ కొట్టడంలో అర్నాబ్ విజయవంతమయ్యాడు.

https://x.com/YSJ2024/status/1998062221470171519?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories