Top Stories

ఎలక్షన్ మరుసటి రోజు దారుణాలు.. సంచలన వీడియో వెలుగులోకి

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే అనేకచోట్ల హింసాత్మక ఘటనలు తలెత్తాయి. ముఖ్యంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధికార వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతోమంది మృత్యువాత కూడా చెందారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగిన ఘటనకు సంబంధించిన ఈ వీడియోలో షాకింగ్ కలిగించే విషయాలు ఉన్నాయి.

తాడిపత్రిలోని అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. ఇంటి మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. సాధారణంగా పోలీసులు కాబట్టి తనిఖీ ప్రక్రియను పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు పోలీసులే తమ లాఠీలతో పగలుగొట్టే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు పగలకొడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పెద్దారెడ్డి ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు. సీసీ కెమెరాలను ఎందుకు పగలగొట్టారు అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

అప్పటికి ఇంకా ఫలితాలు రాకముందే పోలీసులు ఏ స్థాయిలో కూటమి పార్టీల నాయకులకు వత్తాసు పలికారు తెలియజేసే వీడియోగా దీనిని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎన్నికల రోజు నుంచే రాష్ట్రంలో కూటమి నాయకుల దారుణాలు పెరిగిపోవడంతోపాటు పోలీసుల వ్యవహార శైలి దారుణంగా మారిపోయిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు మాదిరిగా పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన ఎంతోమంది వీళ్ళు పోలీసులేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories