ఏపీలో తుఫాన్ దాటిందంటే సరే.. ‘బాబు గారి చాతుర్యం వల్లే పెద్ద నష్టం జరగలేదు’ అని ఎల్లో మీడియాలో మొదలయ్యే కీర్తనలు ఈసారి కూడా మినహాయింపు కాలేదు. మొంథా తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి, ఉ.గోదావరి జిల్లాల్లో విపరీత వర్షాలు కురుస్తున్నా, మీడియా ఫోకస్ మాత్రం తుఫాన్‌పై కాదు — చంద్రబాబు “విజన్”పై ఎక్కువగా పడింది.
‘చంద్రబాబు సమర్థమైన చర్యలతో తుఫాన్‌ను ఎదుర్కొంటున్నారు’, ‘హుద్ హుద్ సమయంలో చూపిన లీడర్‌షిప్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతోంది’, ‘ప్రపంచం మొత్తానికి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన నాయకుడు’ — అంటూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఛానెల్లు తెగ ఎలివేట్ చేస్తున్నాయి. యాంకర్ వెంకటకృష్ణ అయితే మరో అడుగు ముందుకు వేసి, ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తుఫాన్ వచ్చినా చంద్రబాబు సలహాలు తీసుకునేలా ఎదిగారు’’ అని చెప్పడమే గాక, ‘‘ఇదే నాయకత్వం అంటారు’’ అంటూ పొగడ్తల పూలమాల వేసేశాడు.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ ‘ఎలివేషన్ల’ మీద ఘాటైన సెటైర్లు పేలుతున్నాయి. ‘‘యెల్లో ALERT – ప్రపంచంలో ఎక్కడా తుఫాన్ వచ్చినా బాబు గారినే సలహా అడుగుతారట!’’ అంటూ మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ‘‘తుఫాన్ రాకముందే బాబు గారు ఆపేసే టెక్నాలజీ డెవలప్ చేశారు’’ అని పంచ్‌లు వేస్తుంటే, ఇంకొందరు ‘‘బాబు గారికి తుఫాన్ కూడా భయపడుతుంది’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతీ సారి సహజ విపత్తు వచ్చినప్పుడల్లా చంద్రబాబు పేరు చుట్టూ హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఒక ఎల్లో మీడియా రొటీన్‌లా మారిపోయింది. అయితే ప్రజలు మాత్రం ఇప్పుడు ఆ ప్రోపగాండాపై నమ్మకం పెట్టుకోకుండా, వాస్తవ పరిస్థితులనే గమనిస్తున్నారు.
మొత్తానికి.. ప్రతీ తుఫాన్‌కు ముందు ‘వాతావరణ శాఖ’ హెచ్చరిస్తే, తర్వాత ఎల్లో మీడియా మాత్రం ‘బాబు శాఖ’ కీర్తనలు పాడుతుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త సెటైర్‌గా మారిపోయింది.


